అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్
నేరాలు-ఘోరాలు
SAYED HUSSAIN
3 గంటల క్రితం
AI సారాంశం
అస్సాం : కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాలోని డిగార్ రైల్వే స్టేషన్ వద్
అస్సాం : కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాలోని డిగార్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు ఉన్న ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. దీనిపై నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్వో మాట్లాడుతూ ఈ ఘటన ఉదయం 6.54 సమయంలో చోటుచేసుకొన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇప్పటికే సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి బయల్దేరారు. గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజిన్‌తో సహా ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గువాహటి స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు మంగళవారం ఉదయం కోల్‌కతా స్టేషన్ నుంచి బయల్దేరింది. ఇది నేటి మధ్యాహ్నానికి మిజోరంలోని సైరంగ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతున్న వేళ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పట్టాలు తప్పి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!