విశాఖపట్నం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు జిల్లా ప్రోగ్రాం అధికారులతో కలిసి జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమం (National Iodine Deficiency Disorders Control Programme – NIDDCP) గోడ పత్రికను మరియు బ్యానర్ ను ఆవిష్కరించారు. తదుపరి పత్రికా ముఖంగా మాట్లాడుతూ అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు ప్రజల్లో అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియచేసారు. అయోడిన్ మన శరీర ఎదుగుదలకు, ముఖ్యంగా పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి ఎంతో అవసరమైన పోషక పదార్థం. శరీరంలో అయోడిన్ లోపం ఏర్పడితే గాయిటర్ (గొంతు వాపు), పిల్లల్లో ఎదుగుదల లోపాలు, మానసిక వికాసానికి సంబంధించిన సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అయోడిన్ కలిగిన ఉప్పును వినియోగించడం, ఉప్పును సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవడం, సమతుల్య ఆహారపు అలవాట్లను పాటించడం వంటి అంశాలపై అవగాహనపెంపొందించుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs) మరియు ఆరోగ్య సిబ్బంది ప్రజలకు, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, పాఠశాల విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు అయోడిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా అయోడిన్ లోప రుగ్మతలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అయోడిన్ కలిగిన ఉప్పును వినియోగించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది.అయోడిన్ మన శరీరానికి కావలసిన ఒక సూక్ష్మ పోషకం .అయోడిన్ లోప రుగ్మతుల నివారణకు-అయోడైజ్డ్ ఉప్పునే వాడండి .పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అయోడిన్ ఉప్పునే వాడండి . మీరు తినే ఆహారంలో అయోడిన్ లోపం ఉన్నట్లు అయితే – గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం, మృత శిశుజననాల, నెలలు నిండకుండా ప్రసవం మరియు జన్మించిన పిల్లలలో పుట్టుకతో లోపాలు సంభవించవచ్చు. మనం తినే ఆహారంలో అయోడిన్ లోపిస్తే పిల్లలలో మరగుజ్జుతనం, బుద్ధి మాంద్యం, చెవుడు, మూగ వంటి వైకల్యములు సంభవిస్తాయి- వీటిని నివారించడానికి అయోడిన్ ఉప్పునే వాడండి .అయోడిన్ లోపం వాళ్ళ థైరాయిడ్ గ్రంధి పెరిగి గొంతు వద్ద వాపు ఏర్పడుతుంది. దీనినే " గాయిటర్ " అంటారు. అందుకే ఎప్పుడు మంచి అయోడిన్ గల ఉప్పునే వాడండి అని సూచించారు.ఈ కార్యక్రమంలో బాగంగా జీ.వి.ఎం.సి. హైస్కూల్ మధురానగర్ నందు ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.హారిక, మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొని పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగినది .
ఈ కార్యక్రమంలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం, బి.నాగేశ్వర రావు, డెమో, డా.ఎన్.వి.సమత, విమెన్ హెల్త్ ఆఫీసర్, డా.బి.హారిక, ఆర్.బి.ఎస్.కె.జిల్లా సమన్వయకర్త, ఎం.సత్యవతి, డి.పి.హెచ్.ఎన్.ఒ, బి.నాగభూషణరావు, అసిస్టెంట్ మలేరియా అధికారి వారు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!